రెండున్నరేళ్ల వయస్సులో పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉంటారు. కనీసం అఆఇఈలు కూడా సరిగ్గా పలకడం రాని వయస్సది. కానీ కర్ణాటకకు చెందిన తనీషా.. రెండున్నరేళ్లకే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చకచకా చెప్పేస్తోంది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
తల్లి సహాయంతో..
తనీషా తల్లి ఓ బ్యాంకు ఉద్యోగిని. తండ్రి కేపీటీసీఎల్‌లో పనిచేస్తుంటారు. వీరు శివమొగ్గలో నివాసముంటున్నారు. భోజనం సమయంలో తనీషాకు జీకే నేర్పించేది ఆ తల్లి. అవన్నీ తనీషాకు ఇట్టే గుర్తుండిపోతాయి. అప్పటినుంచి ఎన్నో ప్రశ్నలకు చకచకా సమాధానాలు కూడా చెప్పేస్తోందా చిన్నారి.