అమ్మ ఒడిలో ఆడుకుంటూ, మాటలు నేర్చుకునే వయస్సు ఆ చిన్నారిది. పిట్ట కొంచెం కూత ఘనం అనేలా తనదైన మాటలతో అబ్బురపరుస్తోంది. తనలోని ప్రత్యేక ప్రతిభతో రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2020'లో చోటు సంపాదించుకుంది. చిన్న వయస్సులోనే పెద్ద రికార్డును కొల్లగొట్టిన ఆ చిన్నారి పేరే వైష్ణవి. మరి ఈ పాపాయి ఏం చేసిందో తెలుసుకుందాం రండి..
జ్ఞాపకశక్తి అమోఘం..
5 సంస్కృత మంత్రాల పేర్లు, జాతీయ గీతం, 70 మంది గొప్ప గొప్ప చరిత్రకారుల పేర్లు, జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, సౌర కుటుంబంలో గ్రహాల పేర్లు, గణితంలోని చిహ్నాలు, వారాలు, నెలలు, శరీరంలోని అవయవాల పేర్లును ఎక్కడా తడబడకుండా చెప్పేస్తుంది వైష్ణవి. ఇవే కాదండి పక్షులు, జంతువుల అరుపులను అనుకరిస్తుంది.