తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు! - two agents allegedly chopped off fingers and toes of a migrant labourer

చేసిన పనికి వేతనం అడిగిన పాపానికి ఓ శ్రామికుడి వేళ్లు తెగ్గోశారు. కష్టపడి పనిచేసి.. కూలీ డబ్బులు అడిగినందుకు.. ఎప్పటికీ పనిచేయకుండా చేశారు. మహారాష్ట్ర నాగపుర్​లో జరిగిందీ దారుణం.

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు!

By

Published : Oct 6, 2019, 10:31 AM IST

Updated : Oct 6, 2019, 11:57 AM IST

బతుకుతెరువు కోసం వలస వెళ్తే వేళ్లు తెగ్గోశారు!

స్వరాష్ట్రంలో బతుకు భారమని ఏజెంట్లను నమ్మి మరో ప్రాంతానికి వెళ్లాడు ఆ శ్రామికుడు. చేసిన కష్టానికి వేతనం ఇవ్వాలని అడిగినందుకు చేతులు, కాళ్ల వేళ్లు నరికేశారు ఆ ఏజెంట్లు.

ఒడిశా నువాపాడా జిల్లాలోని తికిరపాడా గ్రామానికి చెందిన చమరు పహారియా దళారుల సాయంతో పనికోసం నాగపుర్​కు వెళ్లాడు. ఓ భవన నిర్మాణంలో కూలీగా పహారియాను పనికి కుదుర్చుకున్నారు. తాను చేసిన పనికి డబ్బు అడిగాడు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కూలీ.

డబ్బులు అడిగాడని సత్నామీ, సునానీ అనే ఇద్దరు దళారులు పహారియాపై కక్ష పెంచుకున్నారు. మద్యం తాగించి కుడిచేతికి ఉన్న మూడు వేళ్లను, కాలికి ఉన్న ఐదు వేళ్లను నరికేశారు. అనంతరం నాగపుర్ రైల్వేస్టేషన్​లో వదిలేశారు. పహారియాను రక్షించిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత స్వగ్రామానికి పంపించారు.

"సత్నామి, సునానీ కొన్ని నెలల కిందట నన్ను నాగపుర్​కు తీసుకెళ్లారు. నేను డబ్బడిగితే నాపై దాడి చేసి నా వేళ్లు నరికేశారు."

-చమరు పహారియా, రోజు కూలీ

కుటుంబ సభ్యులు స్థానిక కొమ్నా పోలీస్ స్టేషన్​లో ఘటనపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్​లో చికిత్స

Last Updated : Oct 6, 2019, 11:57 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details