తమిళనాడు ముండియంబక్కం ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలికను సజీవ దహనం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలను విల్లుపురం పోలీసులు అరెస్టు చేశారు.
నిన్న రాత్రి ఘటన
నిన్న రాత్రి బాధితురాలి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగ బయటకు రావడం గమనించారు స్థానికులు. లోపలకు వెళ్లి చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మంటలు ఆర్పి, ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మేజిస్ట్రేట్ వద్ద బాలిక ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వీరిని ఏడీఎంకేకు చెందిన మురుగన్, కలియపెరుమన్గా గుర్తించారు.
తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ముండియంబక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:భారత్లో కరోనా కొత్త రికార్డ్- ఒకేరోజు 4,213 కేసులు