తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన  ట్విట్టర్!

జమ్ము కశ్మీర్ విషయంలో ట్విట్టర్ చేసిన ఓ పొరపాటు.. నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. టైమ్​లైన్​లో జమ్ము కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపడంపై నెటిజన్లు ట్విట్టర్​పై తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ చేసిన ఈ తీవ్ర తప్పిదంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Twitter shows J&K as part of China
ట్విట్టర్​ పొరపాటు జమ్ముకశ్మీర్​ టైమ్​లైన్​ చైనాలో

By

Published : Oct 19, 2020, 11:04 AM IST

Updated : Oct 19, 2020, 1:57 PM IST

జమ్ము కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపించినందుకు ట్విట్టర్​పై తీవ్రంగా మండిపడ్డారు నెటిజన్లు. ట్విట్టర్​ చేసిన ఈ పొరపాటును గుర్తిస్తూ.. అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్​ఎఫ్​) ప్రతినిధి కాంచన్ గుప్త తొలుత ఓ ట్వీట్​ చేశారు.

"అయితే ట్విట్టర్​ ఇప్పుడు భౌగోళిక సరిహద్దులను పునర్నిర్మించి, జమ్ము కశ్మీర్​ను చైనాలో భాగం చేయాలని నిర్ణయించిందన్నమాట. ఇది భారత చట్టాలను ఉల్లంఘించడం కాకపోతే ఇంకేమిటి? భారత పౌరులు చిన్న పొరపాట్లకే శిక్షలు అనుభవించారు. మరి అమెరికాకు చెందిన ఈ టెక్​ కంపెనీ చట్టానికి అతీతమా? " అని కాంచన్ గుప్త టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ను ట్యాగ్​ చేస్తూ ట్వీట్​ చేశారు.

ఈ వివాదంపై స్పందించిన చాలా మంది నెటిజన్లు కూడా ట్విట్టర్​పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

'ట్విట్టర్​ ప్రకారం లేహ్ చైనాలో భాగమన్నమాట' అని మరో నెటిజన్ ట్వీట్​ చేశాడు.

వెంటనే స్పందించి ట్విట్టర్​పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ట్విట్టర్​లో కోరాడు ఓ నెటిజన్. సామాజిక మాధ్యమాలు తమ మూర్ఖత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన సమయమొచ్చిందని రాసుకొచ్చాడు.

'దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ట్విట్టర్ ఇండియాపై చర్యలు తీసుకోండి. భారత సార్వభౌమత్వాన్ని వారు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఈ తీవ్రమైన పొరపాటును కప్పిపుచ్చుకునే అవకాశం వారికి ఇవ్వకండి.​' అని మరో నెటిజన్​ ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ వివరణ..

జమ్ము కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపడంలో.. తలెత్తిన సాంకేతిక సమస్య తమ దృష్టికి వచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. జమ్ముకశ్మీర్ అంశంలో నెలకొన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తామని స్పష్టంచేసింది. ఈ సమస్యను తమ సాంకేతిక నిపుణులు పరిష్కరించినట్లు వివరణ ఇచ్చింది.

ఇదీ చూడండి:ఈ వారంలోనే భారత్-చైనా 8వ దఫా సైనిక చర్చలు!

Last Updated : Oct 19, 2020, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details