తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి - landslide

asom
కొండచరియలు విరిగిపడి.. 24 గంటల్లో 20మంది మృతి

By

Published : Jun 2, 2020, 2:07 PM IST

Updated : Jun 2, 2020, 3:28 PM IST

14:45 June 02

కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

అసోంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి 20మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

కచార్‌ జిల్లాలో ఏడుగురు, హైలాకాండీ జిల్లాలో ఏడుగురు, కరీంగంజ్‌ జిల్లాలో ఆరుగురు కొండచరియలు విరిగిపడి సజీవ సమాధి అయ్యారు. మృతి చెందినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌ సరిహద్దున ఉన్న కరీంగంజ్‌ జిల్లాలో ఆరుగురు మృతి చెందగా.... అందులో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నట్లు అధికారులు చెప్పారు.

14:04 June 02

కొండచరియలు విరిగిపడి.. 24 గంటల్లో 20మంది మృతి

అసోంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. దక్షిణ అస్సాంలోని హైలాకాండి జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Jun 2, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details