తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంబల్​ పడవ ప్రమాదంలో 12 మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి

రాజస్థాన్​లోని కోటాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్​ నదిలో జరిగిన ఈ దుర్ఘటనలో.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 నుంచి 25 మంది క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా.. కొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Boat overturned in Chambal river in Rajasthan
చంబల్​ నదిలో పడవమునక ఘటనలో 12 మంది మృతి

By

Published : Sep 16, 2020, 6:02 PM IST

Updated : Sep 16, 2020, 9:19 PM IST

చంబల్​ నది పడవ ప్రమాదంలో 12 మంది మృతి

రాజస్థాన్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియరాలేదు. వారు కూడా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలిస్తున్నాయి.

ఇదీ జరిగింది..

బూందీ జిల్లాలోని కమలేశ్వర్‌ మహాదేవ్​ ఆలయానికి సుమారు 40 మంది పడవలో ప్రయాణమయ్యారు. పరిమితికి మించిన ప్రయాణికులు, పడవ సరైన కండిషన్​లో లేకపోవడం వల్ల నది మధ్యలోకి వెళ్లే సరికి అదుపుతప్పి బోల్తాపడింది. 20 నుంచి 25 మంది వరకు ఈదుకుంటూ నదీతీరానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.

మోదీ ఆవేదన..

పడవ ప్రమాదంలో 12 మంది చనిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ప్రమాదం తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​.. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.

Last Updated : Sep 16, 2020, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details