తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసుపై విచారణ ప్రారంభించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. పోలీసు సిబ్బందిని ప్రశ్నించేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికే పలువురు పోలీసులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
"తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థన మేరకు.. తూత్తుకుడి జిల్లా సత్తానుకులం పోలీస్ స్టేషన్లో మృతిచెందిన కోవిల్పట్టి జిల్లాకు చెందిన తండ్రీకొడుకుల లాక్అప్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతులు కోరనుంది."
--- ఆర్.కె.గౌర్, సీబీఐ ప్రతినిధి.