తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోయంబత్తూరులో మరో గజరాజు మృతి!

తమిళనాడు కోయంబత్తూరులో వరుసగా ఏనుగులు చనిపోతున్నాయి. తాజాగా మరో ఏనుగు మరణించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగు 20 రోజుల క్రితమే మృతి చెందినట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత గజరాజు మరణానికి గల కారణాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

Tusker found dead in TamilNadu
కోయంబత్తూరులో మరో గజరాజు మృతి!

By

Published : Jun 6, 2020, 9:34 AM IST

తమిళనాడు కోయంబత్తూరు పెరియానైకెన్పాలయంలో ఓ ఏనుగు మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఏనుగు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కోయంబత్తూరులో మరో గజరాజు మృతి!

చనిపోయిన ఏనుగుకు సుమారు 13 ఏళ్లు ఉండొచ్చని, ఇది 20 రోజుల క్రితమే మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. జంతు సంరక్షణ కార్యకర్త సమక్షంలో తమ శాఖకు చెందిన వైద్యుడు ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారని అటవీశాఖ అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఏనుగు మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

కోయంబత్తూరులో గత మూడు నెలల్లో ఎనిమిది ఏనుగులు చనిపోవడం గమనార్హం.

ఇదీ చూడండి:గజరాజుకు గండం- తగ్గిపోతున్న సంఖ్య

ABOUT THE AUTHOR

...view details