తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ.. వ్యాయామం చేసి దేశాన్ని రక్షించండి' - RAHUL MODI LATEST UPDATES

దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో.. ప్రధాని మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని వ్యాయామం చేస్తున్న ఓ పాత వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'Try your magical exercise routine': Rahul's dig at Modi over economy
వ్యాయమం చేసి దేశాన్ని రక్షించండి: రాహుల్

By

Published : Feb 3, 2020, 5:58 AM IST

Updated : Feb 28, 2020, 11:14 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై బడ్జెట్​లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ వ్యాయామం చేస్తున్న ఓ పాత వీడియో ట్విట్టర్​లో పోస్ట్​ చేసి.. మరిన్ని సార్లు వ్యాయామం చేసి దేశంలో నెలకొన్న పరిస్థితులను సానుకూల పరచాలని కోరారు రాహుల్.

ఆర్థిక మాంద్యాన్ని తగ్గించేందుకు బడ్జెట్​లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని చూపించడంలో సర్కారు విఫలమైందని బడ్జెట్ ప్రకటన అనంతరం ఆరోపించారు రాహుల్.

Last Updated : Feb 28, 2020, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details