ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం వేదిస్తోంది. ఎన్నో రకాలుగా నష్టం కలిగిస్తోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాల ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త, కళాకారుడు నితిన్ వాస్ ఒక కొత్త ఆలోచన చేశాడు. మనం నిత్యం వాడే ప్లాస్టిక్ వస్తువుల ప్రత్యామ్నాయాలకు ప్రచారం కల్పించాలని భావించాడు.
ప్లాస్టిక్‌కు సరైన ప్రత్యామ్నాయం కనిపెట్టడం కష్టమైన పనే. ఎంతోకొంత తేడా వస్తుంది. ఉదయం లేవగానే మనం పళ్లను ప్లాస్టిక్ బ్రష్‌తోనే శుభ్రం చేసుకుంటాం. దీని స్థానంలో చెక్కతో చేసిన బ్రష్‌ను వాడాలంటూ నితిన్ చెబుతున్నాడు.
అసోంలోని ఓ తెగ... చెక్కతో బ్రష్ తయారు చేయటంలో నేర్పరులు. అక్కడ ఓ ఎన్జీఓ సహకారంతో వీటిని తయారు చేస్తున్నాడు నితిన్. బ్రష్‌పై ఉండే తంతువులను రీసైక్లింగ్ చేయగలిగే నైలాన్తోనే చేస్తున్నట్లు చెబుతున్నాడు నితిన్.
"ఈ బ్రష్ టేకు చెక్కతో తయారైంది. దానిపై ఉండే తంతువులు భూమిలో కలిసిపోయే నైలాన్‌తో చేసినవి. ఈ బ్రష్ పర్యావరణ హితమైనది.