పాక్ చెరలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇచ్చిన తీర్పుపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయని ట్వీట్ చేశారు.
"కుల్‌భూషణ్ జాదవ్‌కు న్యాయం చేకూర్చడానికి ప్రభుత్వం చేసిన కృషిని నేను అభినందిస్తున్నా. ఐసీజే తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తుందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశిస్తున్నా."
-వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి
"ఐసీజే తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయి. నిజానిజాలు పరిశీలించి వాటి ఆధారంగా తీర్పు ఇచ్చినందుకు ఐసీజేకు అభినందనలు."- నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రి
'తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత, సంక్షేమం కోసం పాటుపడుతుందని', మోదీ వ్యాఖ్యానించారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్ల ఆయన తెలిపారు.