కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన అనంతరం.. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తన ఉద్వాసనపై తొలిసారి స్పందించారు సచిన్ పైలట్.
ట్విట్టర్ బయో మార్పుతో కాంగ్రెస్‌కు సచిన్ కౌంటర్ - Rajasthan political crisis
సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన అనంతరం తొలిసారిగా స్పందించారాయన. 'నిజాన్ని వక్రీకరించగలరేమో కానీ.. ఓడించలేరు' అంటూ ట్వీట్ చేశారు.

ఉద్వాసనపై స్పందించిన సచిన్ పైలట్
'నిజాన్ని వక్రీకరించగలరేమో కానీ.. ఓడించలేరు' అంటూ హిందీలో ట్వీట్ చేశారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతా బయోలో కాంగ్రెస్‌కు సంబంధించిన వివరాలను తొలగించారు సచిన్ పైలట్. కేవలం టోంక్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. ఐటీ, టెలికాం వ్యవహారాల మాజీ మంత్రి వంటి వివరాలే ఉంచారు పైలట్.
ఇదీ చూడండి:రాజస్థాన్ కాంగ్రెస్ నుంచి సచిన్ ఔట్
Last Updated : Jul 14, 2020, 4:28 PM IST