అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్టు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్).. విరాళాల సేకరణ కోసం రెండు బ్యాంకు ఖాతాలను తెరవనుంది. అదే విధంగా ఆన్లైన్ ద్వారా విరాళాలు పొందేందుకు ఓ వెబ్సైట్ను కూడా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది.
"విరాళాల కోసం రెండు ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని ట్రస్ట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు.. ధన్నిపుర్ గ్రామంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రి, వంటశాల, లైబ్రరీని ట్రస్ట్ నిర్మిస్తుంది."