అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు భారత్ తెలిపింది. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
వాణిజ్యం ఒప్పందంపై ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. జటిలమైన అంశాలపై ఒప్పందం చేసుకోవాలనే ఉద్దేశం లేదని, దేనికైనా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు విషయమై భారత్ తమను బాగా చూడలేదని ట్రంప్ పేర్కొన్నట్లు రవీశ్ కుమార్ వివరణ ఇచ్చారు.
"వస్తువులు, సేవలతో కలిపి భారత్‌కు అమెరికా అతిపెద్ద శిక్షణ భాగస్వామి. కొన్ని సంవత్సరాలుగా ఇరుదేశాల వాణిజ్యంలో సుస్థిరమైన వృద్ధి నమోదవుతోంది. వాణిజ్య లోటును దృష్టిలో ఉంచుకుని భారత్ తమను బాగా చూడటం లేదని ట్రంప్ వ్యాఖ్యానించి ఉంటారు.