తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2019, 11:16 AM IST

Updated : Sep 30, 2019, 7:30 PM IST

ETV Bharat / bharat

'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

అమెరికాలో జరగబోయే 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హాజరవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 22న అమెరికా హ్యూస్టన్​లో జరిగే కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు.

'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

అమెరికా హ్యూస్టన్​లో ఈ నెల 22న 'హౌదీ-మోదీ' కార్యక్రమం జరగనుంది. ఈ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ రావడం ఇరు దేశాల బలమైన స్నేహానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.​

'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

"హ్యూస్టన్​ సభకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రావడం ఓ మంచి సంకేతం. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. అమెరికా అభివృద్ధికి భారత సంతతి ప్రజలు చేస్తోన్న కృషికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది."

- నరేంద్ర మోదీ, ప్రధాని

అమెరికాలోని భారతీయ సంఘాలు టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ నెల 22న భారీ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.'హౌదీ మోదీ' కార్యక్రమం అనంతరం ఈ నెల 27న ఐక్యారాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.

ఇదీ చూడండి:అమెరికా, భారత్ సైనికులకు సంయుక్త శిక్షణ

Last Updated : Sep 30, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details