- దిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు
- రాత్రికి ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్న ట్రంప్ దంపతులు
నమస్తే ట్రంప్ : దిల్లీ చేరుకున్న అధ్యక్షుడు - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020
Considering the high-security arrangement for US President Donald Trump, who is scheduled to visit Taj Mahal in Agra with his wife and US first lady Melania Trump today, ticket counters at the historic monument will not be open after 11:30 am. The entry to the Taj Mahal will be closed to visitors in view of high-security arrangements post 11:30 am on Monday.
19:26 February 24
18:46 February 24
దిల్లీ బయలుదేరిన ట్రంప్ దంపతులు
- ఆగ్రా నుంచి దిల్లీ బయలుదేరిన ట్రంప్ దంపతులు
- విమానాశ్రయం వద్ద వీడ్కోలు పలికిన యూపీ గవర్నర్, సీఎం
- రాత్రి 7.30 గం.కు దిల్లీ చేరుకోనున్న ట్రంప్ బృందం
- రాత్రికి ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్న ట్రంప్ దంపతులు
17:37 February 24
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూమర్తే ఇవాంక ట్రంప్, ఆమె భర్త జేర్న్ కుశ్నర్ తాజ్ మహల్ వద్ద పొటో దిగారు.
17:33 February 24
- ట్రంప్ దంపతులు తాజ్‌మహల్ సందర్శన
- సందర్శకుల పుస్తకంలో అభిప్రాయాలు రాసిన ట్రంప్ దంపతులు
- తాజ్‌మహల్ విశిష్టతపై ఆసక్తిగా తెలుసుకున్న ట్రంప్ దంపతులు
- తాజ్‌మహల్ ముందు ఫొటో దిగిన ట్రంప్ దంపతులు
- తాజ్‌మహల్ ముందు ఫొటో దిగిన ఇవాంకా దంపతులు
17:09 February 24
ట్రంప్‌దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్నారు. సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలు రాశారు.
16:38 February 24
ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అనంతరం అక్కడి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లారు.
16:17 February 24
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఆగ్రా చేరుకున్నారు. మరికాసేపట్లో తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు.
15:51 February 24
మోటేరా స్టెడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్‌తో సెల్ఫీలు దిగిన ప్రజలు.
15:34 February 24
తాజ్‌మహల్ సందర్శనకు..
- అహ్మదాబాద్ నుంచి ఆగ్రా బయలుదేరిన ట్రంప్ దంపతులు
- సాయంత్రం 4.45 గంటలకు ఆగ్రా చేరుకోనున్న ట్రంప్
- సాయంత్రం 5.15 గం.కు తాజ్‌మహల్ సందర్శించనున్న ట్రంప్ దంపతులు
- సాయంత్రం 6.45 గంటలకు దిల్లీ బయలుదేరనున్న ట్రంప్
- రాత్రి 7.30 గంటలకు దిల్లీ చేరుకోనున్న ట్రంప్ బృందం
14:40 February 24
మహాత్ముడి గురించి ట్రంప్ ప్రస్తావించడం గర్వకారణం: మోదీ
"భారత శక్తిసామర్థ్యాలు పట్ల ట్రంప్ వెలిబుచ్చిన అభిప్రాయాలకు ధన్యవాదాలు. మహాత్మాగాంధీ, పటేల్, వివేకానంద గురించి ప్రస్తావించడం గర్వకారణం. ఈ స్టేడియం గురించి మీరు అన్న ప్రతిమాట క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలిస్తుంది. స్నేహానికి పునాది విశ్వాసం, ఈ స్నేహం చిరకాలం కొనసాగుతుంది. భారత్-అమెరికాల మైత్రి మరింత దృఢపడింది, ఇది కొత్త తీరాలకు చేరుతుంది. అమెరికాలోని 40 లక్షల మంది భారతీయులు అమెరికా సౌభాగ్యం కోసం కృషిచేస్తున్నారు. శ్వేతసౌధంలో దీపావళి నిర్వహించుకోవడం భారతీయులకు గర్వకారణం. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కులే కాదు, స్వచ్ఛభారత్ అభియాన్ కూడా నిర్వహిస్తోంది. జీవనప్రమాణాల మెరుగుదలలో ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకునేందుకు వేగంగా సాగుతోంది.
నిరుపయోగమైన 1500 చట్టాలను రద్దు చేసిన ప్రజోపయోగమైన కొత్త చట్టాలు తీసుకువస్తున్నాం. ఇవాళ అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. రక్షణ, ఐటీ, ఫార్మా, అంతరిక్ష వంటి అనేక కీలక రంగాల్లో అమెరికా- భారత్ భాగస్వాములు. భారత్‌లో తయారీ అనే విధానం అనేది అమెరికాకు కొత్త అవకాశాలు కల్పిస్తోంది. డిజిటల్ రంగంలో భారత్ అమెరికాకు గొప్ప నాయకులను అందించింది.ఇరుదేశాల మధ్య డిజిటల్ రంగంలో అవినాభావ భాగస్వామ్యం ఏర్పడింది. భారత్- అమెరికా సంబంధాలు ప్రపంచానికి కొత్త దశదిశను నిర్దేశిస్తున్నాయి. ఈ దశాబ్దం తొలినాళ్లలో అమెరికా అధ్యక్షుడు భారత్‌కు రావడం దీర్ఘకాలిక సంబంధాలకు ప్రతీక. అమెరికా భారత్ రక్షణ, ఆర్థిక, శాస్త్రసాంకేతిక భాగస్వామ్యం ముందుకు సాగుతుంది. భారత్ అమెరికా స్నేహం కలకాలం వర్ధిల్లుతుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
14:19 February 24
ఉగ్రవాదానికి తావు లేదు : ట్రంప్
" మేము మా ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగాన్ని పారదోలే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాం. మహాత్మాగాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం నాలో గొప్ప స్ఫూర్తిని నింపింది. మహాత్ముడిని స్మరిస్తూ రేపు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తాను. ప్రపంచ ప్రఖ్యాత ప్రేమైక చిహ్నామైన తాజ్‌మహల్‌ను సాయంత్రం సందర్శిస్తాను. టైగర్ ట్రయంఫ్ పేరుతో అమెరికా, భారత్ సంయుక్త సైనికదళాల ప్రదర్శన స్నేహంలో కొత్త ఆశలు చిగురింప చేస్తోంది. రేపు జరగబోయే చర్చల్లో అత్యాధునికమైన ఆయుధాలు, హెలికాప్టర్లు కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాం.రాడికల్ ఇస్లాం పేరుతో ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాదాన్నిఎదుర్కొంటాం. ఐసిస్ చీఫ్ మరణం ప్రపంచానికి గొప్ప ఊరట. భారత్ అమెరిగా సంయుక్తంగా ఉగ్రవాద నిర్మూలన కోసం పనిచేస్తాయి. పాకిస్తాన్‌తో అమెరికాగ సంబంధాలు సజావుగానే ఉన్నాయి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
14:02 February 24
నమస్తే.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్
- నా నిజమైన స్నేహితుడు ప్రధాని మోదీకి అభినందనలు: ట్రంప్
- అద్భుత విజేతగా దేశాభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు: ట్రంప్
- 5 నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ మైదానంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికాం
- ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో మాకు స్వాగతం పలికారు
- మీ సాదరస్వాగతానికి, అద్భుతమైన దేశ ప్రజలకు కృతజ్ఞతలు: ట్రంప్
- ప్రధాని మోదీ జీవితం ఎంతోమందికి ఆదర్శం: ట్రంప్
- ఒక ఛాయ్‌వాలాగా జీవితం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నారు
- ప్రపంచంలోని అందరూ ప్రధాని మోదీని అభిమానిస్తారు
- ప్రధాని మోదీ మాత్రం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు: ట్రంప్
- ప్రధాని మోదీ గుజరాత్‌కు మాత్రమే ఆదర్శం కాదు: ట్రంప్
- శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే దానికి మోదీ నిదర్శనం: ట్రంప్
- 70 ఏళ్లలోనే భారత్ ఒక అద్భుతశక్తిగా ఎదిగింది: ట్రంప్
- ప్రపంచానికి భారత్ ఎదుగుదల ఒక మార్గదర్శనం: ట్రంప్
- రోడ్లు, అంతర్జాల అనుసంధానం గతంకంటే ఎన్నోరెట్లు మెరుగయ్యాయి
- పారిశుద్ధ్యం, పేదరిక నిర్మూలనలో అద్భుత పురోగతి సాధిస్తున్నారు: ట్రంప్
- భారత్ అద్భుతమైన అవకాశాలకు నెలవు: డొనాల్డ్ ట్రంప్
- శాంతియుత, ప్రజాస్వామ్య దేశంగానే అద్భుత విజయాలు సాధించారు
- ప్రజలకు స్వేచ్ఛనిచ్చి, కలలను సాకారం చేసుకునే దిశగా భారత్ ప్రయాణం సాగుతోంది
- ప్రజల హక్కుల పరరిక్షణలో ఉన్న శ్రద్ధే భారత్- అమెరికాలను సహజ స్నేహితులుగా మార్చింది
- అత్యున్నత లక్ష్యాల సాధన కోసమే కలిసిఉన్నామని ఇరుదేశాల ప్రజలు విశ్వసిస్తారు
- ఉన్నత లక్ష్యాల సాధన కోసం నిరంతరం పరిశ్రమిద్దాం: ట్రంప్
- సచిన్, విరాట్ కోహ్లీ వంటి గొప్ప క్రికెటర్లను భారత్ అందించింది
13:48 February 24
భారత్ -అమెరికా మైత్రి కలకాలం వర్థిల్లాలి: మోదీ
మోటేరా మైదానంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్ -అమెరికా మైత్రి బంధం కలకాలం వర్థిల్లాలని ఆకాంక్షించారు. మోటేరా స్టేడియం నవ చరిత్రకు వేదికగా నిలుస్తోందని చెప్పారు. హ్యూస్టన్‌లో హౌడీ మోదీ కార్యక్రమానికి కొనసాగింపుగానే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ట్రంప్‌కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోందన్నారు. ఇరు దేశాల మైత్రి బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. ట్రంప్‌కు గుజరాత్ మాత్రమే కాదు.. యావద్దేశం స్వాగతం పలుకుతోందని మోదీ అన్నారు.
13:38 February 24
కిక్కిరిసిన మోటేరా స్టేడియం
- మోతెరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి హాజరైన ట్రంప్
- మోతెరా స్టేడియంలో ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ
- మోతెరా స్టేడియంలో అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు
13:25 February 24
మోటేరా స్టేడియానికి చేరుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమం నుంచి మోటేరా స్టేడియానికి చేరుకున్నారు. ఆయన రాకకోసం వేల మంది ప్రజలు స్టేడియంలో వేచి చూస్తున్నారు.
12:51 February 24
మోటేరా స్టేడియానికి అగ్రనేతలు
- సబర్మతి ఆశ్రమం నుంచి మోెటేరా స్టేడియానికి బయల్దేరిన ట్రంప్, మోదీ
- రహదారికి ఇరువైపులా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు
- మోెటేరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి హాజరు
- మధ్యాహ్నం 3.30 గం.కు అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్లనున్న ట్రంప్
- ట్రంప్‌తో పాటు ఆగ్రా వెళ్లనున్న ఆయన సతీమణి మెలానియా ట్రంప్
- సాయంత్రం 4.45 గంటలకు ఆగ్రా చేరుకోనున్న ట్రంప్
- సా. 5.15 గం.కు తాజ్‌మహల్ సందర్శించనున్న ట్రంప్ దంపతులు
- సాయంత్రం 6.45 గంటలకు దిల్లీ బయల్దేరనున్న ట్రంప్
- రాత్రి 7.30 గంటలకు దిల్లీ చేరుకోనున్న ట్రంప్ బృందం
12:40 February 24
చరఖా తిప్పిన ట్రంప్...
సబర్మతి ఆశ్రమం చేరుకన్న ట్రంప్, మెలానియాకు కండువా కప్పి సత్కరించారు. అనంతరం మోదీ, ట్రంప్ కలసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం చరఖా తిప్పారు ట్రంప్.
12:22 February 24
సబర్మతి..
ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. మోటేరా స్టేడియం వరకు 22 కి.మీ. రోడ్‌షోలో భాగంగా ముందుగా సబర్మతికి వచ్చారు. రహదారికి ఇరువైపులా ఘనస్వాగతం పలికారు ప్రజలు.
12:18 February 24
రోడ్ షో ప్రారంభం...
22 కిలోమీటర్ల రోడ్ షో ప్రారంభమైంది. మోటేరా స్టేడియం వరకు ఈ భారీ రోడ్ షో సాగనుంది. పటిష్ట భద్రత మధ్య అధ్యక్షుడి వాహనం అహ్మదాబాద్ రోడ్లపై ప్రయాణిస్తోంది. అయితే ట్రంప్-మోదీ వేరువేరు వాహనాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
12:16 February 24
స్వాగతం ఇలా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌కు చేరుకున్నారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లాభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 11: 40కి షెడ్యూల్ ఉండగా మూడు నిమిషాల ముందే 11:37 గంటలకు దిగింది ఎయిర్‌ఫోర్స్ వన్. అగ్రరాజ్యాధిపతికి సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ట్రంప్‌ను హత్తుకుని స్వాగతించారు. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్ సహా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు.
11:59 February 24
పెద్దన్నకు సాదర స్వాగతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ట్రంప్ దంపతులను భారత్‌కు ఆహ్వానించారు.
- సబర్మతి ఆశ్రమానికి బయల్దేరిన ట్రంప్
- మ. 1.05 గం.కు మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరు
- మధ్యాహ్నం 3.30 గం.కు అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్లనున్న ట్రంప్
- ట్రంప్‌తో పాటు ఆగ్రా వెళ్లనున్న ఆయన సతీమణి మెలానియా ట్రంప్
- సాయంత్రం 4.45 గంటలకు ఆగ్రా చేరుకోనున్న ట్రంప్
- సా. 5.15 గం.కు తాజ్‌మహల్ సందర్శించనున్న ట్రంప్ దంపతులు
- సాయంత్రం 6.45 గంటలకు దిల్లీ బయల్దేరనున్న ట్రంప్
- రాత్రి 7.30 గంటలకు దిల్లీ చేరుకోనున్న ట్రంప్ బృందం
- గుజరాత్: అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- భారత్ పర్యటనకు తొలిసారి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- కుటుంబ సమేతంగా అహ్మదాబాద్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్
- అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్‌నకు సాదర స్వాగతం
- ట్రంప్‌తో కలిసి మోతెరా స్టేడియం వరకు రోడ్‌షోలో పాల్గొననున్న మోదీ
- అనంతరం మోతెరా స్టేడియాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ట్రంప్
- శంఖనాథంతో ట్రంప్‌నకు స్వాగతం
11:49 February 24
విమానాశ్రయానికి మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి స్వాగతం పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
11:40 February 24
అమెరికా అధ్యక్షుడి ఆగమనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
11:24 February 24
అమెరికా అధ్యక్షుడు హిందీలో చేసిన ట్వీట్‌కు స్పందించారు ప్రధాని మోదీ. "భారత్‌లో పర్యటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం." అని ట్రంప్ ట్వీట్ చేయగా.. అందుకు ప్రతిగా.. అతిథి దేవో భవ అని స్పందించారు మోదీ.
11:05 February 24
మోటేరా స్టేడియానికి గంగూలీ
అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు జై షాలు అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియానికి చేరుకున్నారు.
10:59 February 24
భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన సాగనుందిలా..
10:38 February 24
ఎటూ చూసిన జనమే..
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కళాకారులు, వీక్షకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరికాసేపట్లో భారత్‌లో అడుగుపెట్టనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. అనంతరం మోటేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు.
10:28 February 24
కుటుంబ సమేతంగా భారత పర్యటనకు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
10:20 February 24
మరికాసేపట్లో అహ్మదాబాద్ చేరుకోనున్న సందర్భంగా హిందీలో ట్వీట్ చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
10:02 February 24
నమస్తే ట్రంప్: ఆతిథ్యానికి సర్వం సిద్ధం- భద్రత కట్టుదిట్టం
'నమస్తే ట్రంప్'... భారత్, అమెరికాను మాత్రమే కాదు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్నే ఈ పదం ఊపేస్తోంది. భారత్ ఆతిథ్యాన్ని తొలిసారి కళ్లారా చూసేందుకు.. తనివితీరా అనుభవించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రానున్నారు. అగ్రరాజ్యాధిపతికి ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది.
భద్రతా నీడలో...
విమానాశ్రయం నుంచి డొనాల్డ్ ట్రంప్, మెలానియా వచ్చే మార్గంలో 100 వాహనాలతో ఫైనల్ రిహార్సల్‌ను అధికారులు పూర్తి చేశారు.
'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి వేదికైన మోటేరా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, భద్రతా దళాలు సమీక్ష నిర్వహిస్తున్నాయి.
- 25 మంది ఐపీఎస్ అధికారుల నేతృత్వంలోని 10 వేల మంది భద్రతా దళాలను రోడ్ షో, నమస్తే ట్రంప్ కార్యక్రమానికి మోహరించారు.
- యూఎస్ సీక్రెట్ సర్వీస్, జాతీయ భద్రతా దళాలు, ప్రత్యేక భద్రతా దళం నీడలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
- ట్రంప్ వచ్చే మార్గంలో యాంటీ డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ మార్గంలో ఎన్ఎస్జీకి చెందిన యాంటీ స్నైపర్ బృందం ట్రంప్ వాహనశ్రేణితో పాటు ఉండనుంది.
- ట్రంప్ రాకకు ముందే అమెరికా వాయుసేనకు చెందిన నాలుగు సీ17 కార్గో విమానాలు భద్రత, సమాచార పరికరాలతో అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి.
- ఇందులో ట్రంప్ అధికారిక విమానం మెరైన్ వన్, బీస్ట్ వాహనం కూడా ఉన్నాయి.
హస్తినలోనూ కట్టుదిట్టం...
- ఎన్నడూ లేని విధంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ భద్రతపై బలగాలన్నీ హైఅలర్ట్‌లో ఉన్నాయి.
- దిల్లీలో ట్రంప్‌కు ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
- సైన్యం, పారామిలిటరీ సభ్యులతో కూడిన రక్షణ బృందాలు ట్రంప్ ప్రయాణిచ్చే మార్గాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
- యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు భారత భద్రతా దళాలు సహకరిస్తున్నాయి.
- ఎన్ఎస్జీకి చెందిన యాంటీ డ్రోన్, స్నిపర్ బృందాలు, స్వాట్ కమాండోలు, జాగిలాల బృందం, పరాక్రం వాహనాలను హోటల్‌కు దగ్గరున్న వివిధ ప్రాంతాల్లో మోహరించారు.
- రాత్రి వేళ కూడా పనిచేసే 100కు పైగా హై డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను సర్దార్ మార్గం నుంచి మౌర్య హోటల్‌కు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు.
- బలగాలకు దిల్లీ పోలీసులు పూర్తి సహకారమిస్తున్నారు. ట్రంప్ వాహనశ్రేణి వెళ్లే మార్గాల్లో డబుల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
- ఇండియా గేట్, రాజ్‌పథ్ ప్రాంతాలు భారత్, అమెరికా జెండాలతో నిండిపోయాయి.
సబర్మతిలో...
అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమానికి సోమవారం సతీసమేతంగా ట్రంప్ వెళ్లనున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.