తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగ్రా కోసమే ట్రంప్​ 'సబర్మతి' సందర్శన రద్దు! - ట్రంప్​ భారత పర్యటన తాజా వార్తలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనలో చిన్నపాటి మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్​లోని సబర్మతి ఆశ్రమ సందర్శన రద్దయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

trump-visit-to-gandhi-ashram-most-likely-to-get-cancelled
ఆగ్రా కోసమే ట్రంప్​ సబర్మతి సందర్శన రద్దు!

By

Published : Feb 20, 2020, 4:00 PM IST

Updated : Mar 1, 2020, 11:19 PM IST

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అహ్మదాబాద్​లోని గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే ఆగ్రా వెళ్లేందుకు సబర్మతి ఆశ్రమ సందర్శనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఏర్పాట్లు...

అయితే ఇప్పటికే అధ్యక్షుడి సందర్శన కోసం ఆశ్రమం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ట్రంప్​ జంటకు నరేంద్ర మోదీ సబర్మతి విశేషాలు చెప్పేందుకు వీలుగా ఆశ్రమం వెనుక ఒక వేదికను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నిలిపివేశారు.

ప్రకటనలో లేదు...

ట్రంప్​ పర్యటనపై విదేశాంగ కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

"ఈ నెల 25న అధ్యక్షుడు ట్రంప్​ సతీసమేతంగా రాష్ట్రపతి భవన్​లో జరిగే ప్రత్యేక స్వాగత కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ఇరువురు రాజ్​ఘాట్​కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు."

- విదేశాంగ కార్యదర్శి ప్రకటన

విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్​ ష్రింగగ్లా పత్రికా సమావేశంలోనూ ఎక్కడా సబర్మతి ఆశ్రమ సందర్శన గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

Last Updated : Mar 1, 2020, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details