తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోటేరాలో మోదీ-ట్రంప్​ మ్యాచ్​.. స్టేడియం హౌస్​ఫుల్​ - trump visit patel stadium

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యాన్ని మోటేరా స్టేడియంలో పొందనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియం.. అమెరికా అధ్యక్షుడి కోసం ముస్తాబయింది.

Trump to get lifetime reception in Motera Stadium
మోటేరాలో మోదీ-ట్రంప్​ మ్యాచ్​.. స్టేడియం హౌస్​ఫుల్​

By

Published : Feb 24, 2020, 11:20 AM IST

Updated : Mar 2, 2020, 9:24 AM IST

మోటేరాలో మోదీ-ట్రంప్​ మ్యాచ్​.. స్టేడియం హౌస్​ఫుల్​

అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ సిద్ధమైంది. ఈ రోజు, రేపు జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​లో నిర్మించిన భారీ స్టేడియంలో 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమం జరగనుంది. ఇరువురు దేశాధినేతలు స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంపై అందరి దృష్టి నెలకొంది.

ప్రధాని కలల స్టేడియం...

మోటేరా స్టేడియానికి 'సర్దార్​ పటేల్​ గుజరాత్​ స్టేడియం' అని పేరుమార్చారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్​. ప్రధాని గుజరాత్​ క్రికెట్​ ఆసోసియేషన్​ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని నిర్మించాలని సంకల్పించారు.

విశేషాలు...

నవీకరణ...

2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 3 ప్రవేశ ద్వారాలతో 63 ఏకరాల్లో ఈ స్టేడియం ఉంది. ఇందులో ఒలింపిక్​ స్థాయి ఈత కొలను, నాలుగు డ్రెస్సింగ్​ రూమ్​లు, 75 కార్పొరేట్​ బాక్స్​లు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రత్యేకత ఎల్​ఈడీ దీపాలు. సాధారణంగా స్టేడియంలో ఉండే ఫ్లడ్​లైట్లు కాకుండా ఇక్కడ ఎల్​ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.

ఖర్చు...

ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ. 719 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఇందులో అత్యాధునిక డ్రెస్సింగ్​ గదులు, ఫుడ్​ కోర్ట్​లు, ప్రతి స్టాండ్​లోనూ ఆతిథ్య ప్రదేశాలు ఉన్నాయి. రెండు చిన్న క్రికెట్​ ప్రాక్టీస్​ మైదానాలు ఇక్కడ నెలకొన్నాయి.

ప్రధాన మైదానానికి బయట ఇండోర్​ ప్రాక్టీస్​ పిచ్​లు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో ఇక్కడ ప్రాక్టీస్​ చేసుకోవచ్చు. క్రికెట్​ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్​, టెన్సిస్​ కోర్ట్​లు, స్క్వేష్​ అరెనా, టేబుల్​ టెన్నిస్​కు ప్రత్యేక ప్రదేశాలు, క్లబ్​హౌస్​ ఉన్నాయి.

సామర్థ్యం...

ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్దదైన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియం రికార్డ్​ను మోటేరా తిరగరాసింది. మెల్​బోర్న్​ సామర్థ్యం లక్ష కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మించారు.

అతిపెద్ద పార్కింగ్​...

3 వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి.

స్కైవాక్​...

మోటేరా మెట్రో స్టేషన్​ ప్రాజెక్ట్​లో భాగంగా స్కైవాక్​ను 2020 సెప్టెంబర్​ తర్వాత పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే మెట్రో స్టేషన్ల నుంచి 300 మీటర్ల లోపే ప్రజలు ఇక్కడకు చేరుకోగలరు. రోడ్డు మార్గం ద్వారా వచ్చే అవసరం ఉండదు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్:ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?

Last Updated : Mar 2, 2020, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details