తెలంగాణ

telangana

ట్రంప్​కు సబర్మతీ ఆశ్రమ బహుమతులు!

By

Published : Feb 18, 2020, 11:43 PM IST

Updated : Mar 1, 2020, 7:15 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నూలు వడికే రాట్నం, మహాత్ముడి చిత్రం, పుస్తకాలు, చేనేత ఖాదీ వస్త్రాలను బహూకరించనున్నారు నిర్వాహకులు.

trump
ట్రంప్​నకు సబర్మతి ఆశ్రమ బహుమతులు!

ఫిబ్రవరి 24 నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులపాటు భారత్​లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్​కు అరుదైన బహుమతులు బహూకరించనున్నారు ఆశ్రమ నిర్వాహకులు. మహాత్ముడి గుర్తులైన నూలు వడికే రాట్నం, మహాత్ముడి చిత్రం, చేనేత ఖాదీ వస్త్రాలను బహుమతిగా అందజేస్తారు.

"గుజరాత్ ప్రభుత్వం పలు బహుమతులను ఇవ్వాలని యోచిస్తోంది. మా తరఫున మేం కూడా పలు బహుమతులు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. నూలు వడికే రాట్నం, గాంధీ ఆత్మకథ, 'మై లైఫ్ మై మెసేజ్' అనే మరో పుస్తకం, గాంధీ చిత్రపటాలు అందించనున్నాం. ఇవి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంత కీలకంగా పనిచేశాయో వివరించనున్నాం."

-అతుల్ పాండ్య, సబర్మతీ ఆశ్రమ డైరెక్టర్

ఆశ్రమ నిర్వాహకులు ఖాదీ మాలలతో ట్రంప్​ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆశ్రమం వెనకాల ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదిక నుంచి సబర్మతీ ఆశ్రమాన్ని చూపిస్తారని తెలుస్తోంది.

ఇదీ చూడండి:గూగుల్‌ ఎర్త్‌ వ్యూలో భారత్‌ దృశ్యాలు అద్భుతం

Last Updated : Mar 1, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details