తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీజీ... ఆ ఔషధాలు పంపండి ప్లీజ్​: ట్రంప్ - coronavirus disease in us

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్​లో సంభాషించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా నియంత్రణపై చర్చించారు. వైరస్ కట్టడికి మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ఉపకరిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఈ ఔషధాన్ని సరఫరా చేయాలని ప్రధానిని కోరారు ట్రంప్.

modi-trump
హైడ్రాక్సీ క్లోరోక్విన్​ సరఫరా చేయాలని కోరిన ట్రంప్

By

Published : Apr 5, 2020, 9:59 AM IST

కరోనా చికిత్సకు అవసరమయ్యే​ హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ఔషధాన్ని సరఫరా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మలేరియా చికిత్సకు ఉపయోగించే ఆ ఔషధం ఎగుమతులపై భారత్​ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశారు.

కరోనాపై కలిసి పోరాడడంపై శనివారం సాయంత్రం ఫోన్​లో చర్చించారు మోదీ, ట్రంప్. కొద్ది గంటల తర్వాత ఇద్దరి సంభాషణపై శ్వేతసౌధంలో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు.

"భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. మిత్రదేశంలో పెద్దమొత్తంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను తయారు చేస్తున్నారు. వైరస్ నయం కావడంలో కీలకమైన ఔషధంగా భారత్​ దీనిని పరిగణిస్తోంది. మేం కోరిన మేరకు ఔషధాలను సరఫరా చేస్తే అమెరికా ఎంతో సంతోషిస్తుంది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ నేపథ్యం..

కరోనా వైరస్ నియంత్రణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ఎంతో ఉపకరిస్తుందని ప్రపంచదేశాల వైద్యులు గుర్తించారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా వైరస్​ నయమయ్యేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ఎంతో ఉపకరిస్తోందని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీ ఔషధ ఎగుమతులపై మార్చి 25న నిషేధం విధించింది భారత్. అయితే మానవతా కోణంలో ఆలోచించి కొన్ని దేశాలకు అవసరం మేరకు ఎగుమతులకు అనుమతిస్తామని వెల్లడించింది.

ఇదీ చూడండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్​

ABOUT THE AUTHOR

...view details