తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-పాక్​లు కోరితే మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్​ - శ్వేతసౌధం

భారత్​-పాక్​లు కోరితే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని శ్వేతసౌధం తెలిపింది. ఇరుదేశాలు పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.

భారత్​-పాక్​లు కోరితే మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్​

By

Published : Aug 23, 2019, 9:11 AM IST

Updated : Sep 27, 2019, 11:14 PM IST

జమ్ముకశ్మీర్​ సమస్యపై మరోసారి స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. భారత్​-పాకిస్థాన్​లు కోరితే.. ఈ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సిద్ధంగా ఉన్నారని తెలిపింది శ్వేతసౌధం. 'కశ్మీర్'పై జరుగుతున్న పరిణామాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

"కశ్మీర్ విషయంలో భారత్​-పాక్ సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా పిలుపునిస్తూనే ఉంది."
- శ్వేతసౌధ ఉన్నతాధికారి

చర్చలకు ముందు ఇదేంటి?

ఈ వారాంతంలో ఫ్రాన్స్​లో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సందర్భంలోనే ట్రంప్- మోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 'కశ్మీర్​' అంశంలో మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్వేతసౌధం ప్రకటించడం గమనార్హం.

కశ్మీర్ మాదే...

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిపై పాకిస్థాన్ అనవసర జోక్యం చేసుకుంటోంది. అయితే పాక్​ వాదనలను భారత్ తోసిపుచ్చింది. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత విషయమని ప్రపంచానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ దాయాది దేశం తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది.

ఇదీ చూడండి: ''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''

Last Updated : Sep 27, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details