తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 4:28 PM IST

ETV Bharat / bharat

చెన్నై ఇంజినీర్​కు ట్రంప్​ ప్రభుత్వంలో కీలక పదవి

భారతీయ అమెరికన్​ ఇంజినీర్​కు కీలక పదవి అప్పగించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ సేతురామన్ పంచనాథన్​ను 'నేషనల్ సైన్స్ ఫౌండేషన్' డైరెక్టర్​గా నియమించారు. ఆరేళ్లు ఈ పదవిలో ఉండనున్నారు పంచనాథన్​.

Trump picks Indian-American computer scientist to lead National Science Foundation
చెన్నై ఇంజినీర్​కు ట్రంప్​ ప్రభుత్వంలో కీలక పదవి

అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తిని కీలక పదవి వరించింది. చెన్నైకు చెందిన డాక్టర్ సేతురామన్ పంచనాథన్​ను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) డైరెక్టర్​గా నియమిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచనాథన్ అనుభవం, పరిశోధనలు, నిబద్ధతే ఆయనకు ఈ పదవిని తెచ్చిపెట్టాయని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.

విద్య, పరిశోధనలు, వైద్య రంగాల అభివృద్ధి కోసం ఎన్ఎస్ఎఫ్ పనిచేస్తుంది. ప్రస్తుత డైరెక్టర్​ ఫ్రాన్స్ కోర్డోవా ఆరేళ్ల పదవీకాలం డిసెంబర్​తో ముగియనుండగా.. అనంతరం పంచనాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

పంచనాథన్ గురించి..

1981లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు పంచనాథన్. 1984లో బెంగళూరులో ఈసీఈ పూర్తి చేశారు. 1986లో మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో మాస్టర్స్ పట్టా పొందారు. 1989లో కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పీహెచ్​డీ పూర్తి చేశారు.

ప్రస్తుతం పంచనాథన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎస్​యూ) పరిశోధన విభాగం అధిపతిగా, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నేషనల్ సైన్స్ బోర్డ్, నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ తదితర విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.



ABOUT THE AUTHOR

...view details