తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​కు షాక్... 'హౌడీ మోదీ'లో ట్రంప్​ పరోక్ష సందేశం - హ్యూస్టన్​

హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరైన ట్రంప్​... భారత ప్రధాని మోదీపై ప్రంశసల వర్షం కురిపించారు. దేశాభివృద్ధికి మోదీ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు.. ఈ అంశంలో భారత్​కు మద్దతుగా నిలుస్తామని పాకిస్థాన్​కు పరోక్ష సందేశం అందించారు.

పాక్​కు షాక్! హౌడీ మోదీలో ట్రంప్​ పరోక్ష సందేశం

By

Published : Sep 22, 2019, 11:51 PM IST

Updated : Oct 1, 2019, 3:46 PM IST

హ్యూస్టన్​ వేదికగా జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. భారత దేశాభివృద్ధికి మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని ట్రంప్​ కితాబిచ్చారు. పేదరిక నిర్మూలనలో మోదీ సాధించిన విజయాలను ప్రస్తావించారు.

భారత్​తో మైత్రిని ప్రముఖంగా ప్రస్తావించారు ట్రంప్​. శ్వేతసౌధంలో తన రూపంలో భారత్​కు మంచి మిత్రుడు దొరికాడని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ప్రధానితో వ్యక్తిగత బంధాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్​... అమెరికాకు దక్కిన అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా మోదీని అభివర్ణించారు.

ఉగ్రవాదంపై పోరులో భారత్​కు మద్దతుగా నిలుస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. పాకిస్థాన్​ పేరును ప్రస్తావించకుండానే ఆ దేశానికి స్పష్టమైన సందేశాన్నిచారు.

ఉగ్రవాదంపై ట్రంప్​ ప్రసంగం

ఇంధన, రక్షణ, అంతరిక్ష, పరిశోధన రంగాల్లో ఇరు దేశాల మైత్రి మంచి ఫలితాల్నిస్తుందన్నారు ట్రంప్​. త్వరలోనే రక్షణ రంగంలో ఒప్పందాలు ఖాయమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- మోదీ చేతికి హ్యూస్టన్ నగర తాళం

Last Updated : Oct 1, 2019, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details