భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో పర్యటించడాన్ని భాజపా నేతలు స్వాగతించారు. మోదీ ప్రసంగం 130 కోట్ల మంది భారతీయులకు భావోద్వేగాన్ని కలిగించడమేకాక, సాయుధ బలగాల్లో ధైర్యాన్ని పెంపొందిస్తాయని జేపీ నడ్డా అన్నారు. ప్రధాని చర్యల్లో నిజమైన నాయకత్వం ఉందన్నారు.
ప్రధాని మోదీ పర్యటన.. సైనిక దళాల్లో మనోధైర్యాన్ని పెంచుతుందని కేంద్ర హెంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నాయకత్వం దేశాన్ని ముందుండి నడిపిస్తుందన్నారు షా. మోదీ లద్దాఖ్ పర్యటనలో సైనికులతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.