నిలిచిన వాహనాలు..
కొల్హాపుర్ జిల్లాలోని వర్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం వల్ల నదీ పరివాహక గ్రామాలు నీటమునిగాయి. కరద్ సమీపంలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు నాలుగు రోజుల నుంచి వరదల్లో చిక్కుకుపోయామని లారీ డ్రైవర్లు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఆగ్రా నుంచి ఆలుగడ్డలు తీసుకొస్తున్నాను. సరుకు ట్రక్‌లో ఉండిపోయింది. నాలుగు రోజులుగా ఇక్కడే ఉన్నాం. హుగ్లీ వెళుతున్నాం. నది ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే తరలించకపోతే ఆలు పాడైపోతాయి. సరుకు పాడైతే సుమారు 4-5 లక్షల రూపాయలు నష్టం వస్తుంది."
- సురేష్, ఆలుగడ్డ వ్యాపారి