కొద్ది రోజుల క్రితం వెలుగుచూసిన టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) వికాస్ ఖంచందానిను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. సెలవు దినం రోజున ఏర్పాటు చేసే ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సీఈఓ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రిపబ్లిక్ టీవీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
రిపబ్లిక్ టీవీ పశ్చిమ విభాగం డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను పోలీసులు గతనెలలోనే అదుపులోకి తీసుకోగా.. ఈ నెలారంభంలో ఆయనకు బెయిల్ లభించింది.