20 మంది కేబినెట్ మంత్రుల రాజీనామా..
మధ్యప్రదేశ్ రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేల అదృశ్యం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఇంటిలో భేటీ అయ్యారు కేబినెట్ మంత్రులు, ముఖ్యనేతలు. సుదీర్ఘ చర్చల అనంతరం మొత్తం 20 మంది కేబినెట్ మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించారు ముఖ్యమంత్రి.
త్వరలోనే పూర్తిస్థాయి కేబినెట్‌ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాంగ్ సింఘర్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారని.. జ్యోతిరాదిత్య సింధియా కూడా తమతోనే ఉన్నారని పేర్కొన్నారు.