తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భద్రతా కారణాలతోనే బలగాల తరలింపు' - కశ్మీర్

జమ్ముకశ్మీర్​కు బలగాల తరలింపుపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ తరలింపు చేపట్టామని స్పష్టం చేసింది. వివరాలు బహిరంగంగా వెల్లడించలేమని ప్రకటించింది.

కశ్మీర్​కు బలగాల తరలింపుపై హోంశాఖ వివరణ

By

Published : Aug 2, 2019, 12:46 PM IST

Updated : Aug 2, 2019, 3:43 PM IST

కశ్మీర్​ లోయలో 28వేల మంది భద్రతా సిబ్బంది మోహరింపుపై కేంద్ర హోంశాఖ స్పందించింది. భద్రతా కారణాలతోనే ఈ మేరకు సైన్యానికి ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది.

జమ్ముకశ్మీర్​కు సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని... ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగానే బలగాల ప్రక్రియ చేపడుతున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలగాల తరలింపుపై వివరణ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. అంతర్గత భద్రతా కారణాలతోనే ఈ ప్రక్రియ చేపట్టామని, బహిరంగంగా వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది.

వారం కిందటే బలగాల తరలింపునకు ఆదేశాలిచ్చామని, వారు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాయి హోంశాఖ వర్గాలు.

" అంతర్గత భద్రతా పరిస్థితి, శిక్షణా అవసరాలను గుర్తించి బలగాల తరలింపు చేపట్టాం. జవాన్ల ఉపసంహరణ, నూతన బృందాలను చేర్చే ప్రక్రియ నిరంతరం జరిగేదే."

-హోంశాఖ వర్గాలు

ఇదీ చూడండి: రవీష్​ కుమార్​కు 'రామన్​ మెగసెసె' అవార్డు

Last Updated : Aug 2, 2019, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details