తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో అంత్యక్రియలను ఆన్​లైన్​లో వీక్షించొచ్చు - funerals Online streaming system

కరోనా నేపథ్యంలో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేంద్రం ఆంక్షలు విధించగా.. సంబంధిత దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. త్రివేండ్రంలోని శాంతికవాడం శ్మశాన వాటికలో ఈ సేవలు అందుబాటులోకి తేనుంది.

ఆ రాష్ట్రంలో అంత్యక్రియలను ఆన్​లైన్​ ద్వారా వీక్షించవచ్చట!
Trivandrum Corporation has made arrangements to watch the funerals live at Shantikavatam

By

Published : Oct 22, 2020, 3:11 PM IST

కేరళలోని త్రివేండ్రంలో అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తోంది అక్కడి యంత్రాంగం. ప్రజా శ్మశానవాటిక శాంతికవాడం నుంచి ఈ సేవలు కల్పించనుంది. కరోనా నేపథ్యంలో అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు.. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

ఇలా వీక్షించవచ్చు..

ఈ సేవలకు సంబంధించి ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ వ్యవస్థను అభివృద్ధి చేశారు అధికారులు. అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలను.. డైరెక్టర్​ ఆఫ్​ స్మార్ట్​ త్రివేండ్రం వెబ్​ పేజీ, శాంతికవాడం యూట్యూబ్​ ఛానెల్​, ఫేస్​బుక్​ పేజీల ద్వారా వీక్షించవచ్చు. సంబంధిత దృశ్యాలు, ఖననమయ్యే వ్యక్తి పేరు శాంతికవాడం గేట్​ ముందు ప్రదర్శిస్తారట. అంతేకాకుండా.. దహన ధ్రువీకరణ పత్రం (క్రిమేషన్​ సర్టిఫికెట్​)ను ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంచుతారట.

రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కొవిడ్​ మార్గదర్శకాలను అనుసరించి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 381 మందికి శాంతికవాడంలో అంత్యక్రియలు జరిగాయి.

ఇదీ చదవండి:నేపాలీయుల కోసం.. భారత్​లో ఆ బ్రిడ్జ్​ పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details