కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్, మరో నిందితుడు సందీప్ నాయర్లను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. కుటుంబసభ్యులతో పాటు ఆమెను బెంగళూరులో అధికారులు అరెస్ట్ చేశారు. కేరళ కొచ్చిలోని ఎన్ఐఏ కార్యాలయంలో ఆమెను ఆదివారం హాజరుపరుస్తారు.
ఇదీ కేసు...
ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన.. సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇందులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్‌పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది.
పక్కా సమాచారంతో....