త్రిపుర మధుపుర్ ఠాణా పరిధిలోని పురతల్ రాజ్నగర్ గ్రామానికి చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ కారణంగా మలేసియాలో చెందినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని మలేసియా అధికారులు ఫోన్ చేసి తమకు చెప్పారని వెల్లడించారు.
తమ కుమారుడి మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
"నా 23 ఏళ్ల మనుమడు రెండేళ్లక్రితం మలేసియాకు వెళ్లాడు. బుధవారం ఉదయం మలేసియా అధికారుల నుంచి మాకు ఫోన్ వచ్చింది. హుస్సేన్ మరణించినట్లు వాళ్లు చెప్పారు. తన మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా."