త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రద్యోత్ దేవ్ బర్మన్ వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక 'పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర' పార్టీ కార్యకర్తను పోలీసు స్టేషన్లోనే చెంపదెబ్బకొట్టారు. ఈ వీడియోను భాజపా పార్టీ నేత, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ విడుదల చేశారు. త్రిపురలో భాజపా, ఐపీఎఫ్టీ ఉమ్మడిగా ఎన్నికల బరిలో నిలిచాయి.
ఇటీవల ఖోయ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో ప్రచారం చేస్తున్న ప్రద్యోత్ దేవ్ సోదరి ప్రజ్ఞ్య దేవి బర్మన్ కాన్వాయ్‌పై ఐపీఎఫ్టీ కార్యకర్త ఇటుకరాయితో దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆవేశానికిలోనైన ప్రద్యోత్.. నిందితునిపై చేయి చేసుకున్నారు.
త్రిపుర లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజ్ఞ్యదేవి పోటీచేస్తున్నారు.