లోక్సభ సమావేశాల ఐదో రోజున ముస్లిం మహిళల రక్షణ కోసం నూతనంగా రూపొందించిన ముమ్మారు తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.
లోక్సభ ముందుకు ముమ్మారు తలాక్ బిల్లు - congress
ముమ్మారు తలాక్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. పార్లమెంటు సమావేశాల ఐదో రోజున బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ముమ్మారు తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
లోక్సభ ముందుకు ముమ్మారు తలాక్ బిల్లు
ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ నేత శశిథరూర్ వివరణ ఇచ్చారు. కేవలం ఓకే వర్గాన్ని లక్ష్యం చేసుకుని రూపొందిన బిల్లును తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి: ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం 'యోగా': మోదీ