ముంబయిలో ఉగ్రవాదుల దుశ్చర్యకు 12ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. అసువులు బాసిన అమరవీరులకు మహారాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధాంజలి ఘటించింది. నవంబర్ 26 దాడులనుంచి దేశాన్ని రక్షించిన అమరవీరులకు నివాళులు అర్పించారు.
గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తదితరులు.. దక్షిణ ముంబయిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్మించిన స్మారకం వద్ద నివాళులు అర్పించారు.