తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్సీని ప్రేమించిన యువతిపై కర్రలతో దాడి

దేశంలో పరువు కోసం పాల్పడుతున్న నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లో జరిగింది. ఎస్సీ యువకుణ్ని ప్రేమించిందనే కారణంతో గిరిజన యువతిని కర్రలతో చితకబాదారు బంధువులు. ఈ చర్యలో గ్రామ సర్పంచ్​ కూడా ఉండటం విషాదకరం. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ఎస్సీని ప్రేమించిన యువతిపై కర్రలతో దాడి

By

Published : Jun 30, 2019, 3:53 PM IST

పరువు పేరిట జరుగుతోన్న నేరాల్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సీ యువకుణ్ని ప్రేమించిందనే కారణంతో యువతిపై బంధువులు కర్రలతో దాడి చేశారు. ఇష్టారీతిలో కొడుతూ.. చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు జిల్లాలోని బాగ్​ పోలీసులు. యువతి సోదరునితో పాటు ఘటనకు సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు. ఈ చర్యలో గ్రామ సర్పంచ్ కూడా పాల్గొన్నాడని తెలిపారు.

జరిగిందేమిటి?...

గిరిజన యువతి అదే గ్రామంలోని ఎస్సీ యువకుణ్ని ప్రేమించింది. ఆ యువకుడితో పారిపోయిందని యువతిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులకు ఆ ప్రేమికుల జంట బంధువులకు దొరికారు. ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు సొంత కులానికి చెందిన మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. కానీ.. యువతి ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులతో వారించింది. ఆగ్రహించిన యువతి సోదరుడు, బంధువులు కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు.

ఎస్సీని ప్రేమించిన యువతిపై కర్రలతో దాడి

ఇదీ చూడండి: రోగిని బెడ్​షీట్​తో లాక్కెళ్లిన ఆసుపత్రి సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details