తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2020, 10:51 AM IST

ETV Bharat / bharat

'వ్యాక్సిన్​కు అనుమతిస్తే పూర్తిగా విశ్వసించాలి'

వ్యాక్సిన్ వినియోగంపై నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ వీకే పాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఒకసారి వినియోగానికి అనుమతులు ఇస్తే.. ఆ వ్యాక్సిన్​ అన్ని పరీక్షల్లో నెగ్గినట్లేనని తెలిపారు. ఇందులో ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మొత్తం 6 వ్యాక్సిన్లు వివిధ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు తెలిపారు.

Vaccines being tested in the country
వ్యాక్సిన్​ అనుమతులపై టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ వీకే పాల్ స్పష్టత

"వ్యాక్సిన్​ల అత్యవసర వినియోగానికి అనుమతిస్తే అవి శాస్త్రీయంగా పరీక్షలను నెగ్గాయని విశ్వసించాలి. రక్షణ పరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లే. వీటి విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. భద్రత విషయంలో మన వ్యవస్థలు సంపూర్ణమైన బాధ్యతలు తీసుకున్నాయి. ప్రపంచ స్థాయికి మించిన ప్రమాణాలతో పని చేయడానికి ప్రయత్నిస్తున్నాయి." అని నీతి ఆయోగ్ సభ్యుడు వ్యాక్సిన్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ వీకేపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం 6 వ్యాక్సిన్లు వివిధ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు తెలిపారు.

టీకా ఆలస్యం కాదు..

టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు కోరతూ భారత్ బయోటెక్, ఫైజర్, సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు కేంద్రం మంగళవారం తెలిపింది. ఈ కంపెనీల నుంచి డీసీజీఐ మరింత సమాచారం కోరిందని పేర్కొంది. అలా సమాచారం కోరడం వల్ల టీకాను అందుబాటులోకి తెచ్చే విషయంలో ఆలస్యం చోటుచేసుకోబోదని స్పష్టం చేసింది. కంపెనీలు డీసీజీఐకి సమర్పించిన దరఖాస్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్​సీఓ)లో కొవిడ్19పై ఏర్పడిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని వీకే పాల్ వివరించారు.

ఇదీ చూడండి:దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీకి రంగం సిద్ధం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details