తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.500 నోట్లు చూసి గజగజ వణికిన స్థానికులు! - Locals of Lucknow trembled at the sight of Rs.500 notes

కరోనా భయాలు అలముకున్న వేళ.. కరెన్సీ నోట్లు చూసి కూడా ప్రజలు భయపడతున్నారు. మీరు చదువుతోంది నిజంగా నిజం. లఖ్​నవూలో రోడ్డుపై పడి ఉన్న రెండు రూ.500 నోట్లను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కరోనా వైరస్​ను వ్యాప్తి చేయడం కోసమే ఎవరో అలా పడేశారని అనుమానించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ నోట్లను పరీక్షల కోసం భద్రపరిచారు.

trembled at the sight of Rs.500 notes Locals of Lucknow!
రూ.500 నోట్లు చూసి గజగజ వణికిపోయిన స్థానికులు!

By

Published : Apr 11, 2020, 11:26 AM IST

రోడ్డుపై కరెన్సీ నోట్లు పడి ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఎవరూ చూడకుండా వెంటనే తీసి జేబులో వేసుకుంటారు. లేదా అవి ఎవరివో అని ఆరా తీస్తారు. అయితే లఖ్‌నవూలో మాత్రం అలా జరగలేదు. రోడ్డుపై పడి ఉన్న రెండు రూ.500 నోట్లను తీసుకునేందుకు స్థానికులు ముందుకు రాలేదు సరికదా.. భయంతో దూరంగా జరిగారు కూడా. దీనికి కారణం ఏంటో తెలుసా.. కరోనావైరస్‌ భయం.

భయం.. భయం

లఖ్‌నవూలోని పేపర్‌ మిల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి కాలనీ వాసులు రెండు రూ.500 నోట్లు తాము వెళ్లే దారిలో పడి ఉండటాన్ని గమనించారు. వాటిని తీసుకోవడానికి బదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో గుమిగూడి చర్చలు మొదలు పెట్టారు. ఆపై పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. అందరినీ ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. అలాగే దగ్గర్లోని వైద్యుడి వద్దకు వెళ్లి విషయం వివరించగా.. 24 గంటల పాటు వాటిని ముట్టుకోకుండా వేరుగా ఉంచాలని సూచించారు.

ఏమై ఉంటుంది?

దానిపై మీడియా అక్కడి ప్రజలను పలకరించగా..కరోనా వైరస్ వ్యాప్తి చేయడం కోసమే ఎవరో వాటిని అక్కడ పడేశారని అనుమానం వ్యక్తం చేశారు. దానిపై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటమే వారి భయానికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఆ వీడియోకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికీ ఆ రూ.500 నోట్లు పోలీసుల వద్దే ఉన్నాయి.

ఇదీ చూడండి:'తబ్లీగీ'ని దాచిన నేత- ఒక్కరి నిర్లక్ష్యానికి ఊరంతటికీ శిక్ష

ABOUT THE AUTHOR

...view details