తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ట్రీ బాబా" ఆపరేషన్​ హరితహారం - మనీశ్​​ తివారీ

"ఈ నగరానికి ఏమైంది... ఓ వైపు కాలుష్యం.. మరోవైపు చెట్ల నరికివేత"... ఈ ఆలోచన రాగానే మనీశ్​ తివారీకి భయమేసింది. ఇదిలా కొనసాగితే తరువాతి తరాలకు ప్రాణవాయువైనా దొరకదని ఆందోళన కలిగింది. ఆ క్షణం నుంచి ప్రతి నిమిషం మొక్కల కోసమే జీవిస్తున్నారు.

"ట్రీ బాబా" ఆపరేషన్​ హరితహారం

By

Published : May 17, 2019, 9:02 AM IST

"ట్రీ బాబా" ఆపరేషన్​ హరితహారం

రోజురోజుకు మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. తన గురించి తప్ప పక్కవాళ్ల గురించి ఆలోచించే సమయం ఉండటం లేదు. ఇందుకు పూర్తి భిన్నంగా చెట్ల పెంపకమే పనిగా జీవనం సాగిస్తున్నారు ఓ వ్యక్తి.

ఉత్తరప్రదేశ్​ లఖ్​నవూలో పచ్చ రంగు సైకిల్​పై, కాషాయ వస్త్రాలు ధరించిన ఓ వ్యక్తి తరచుగా కనిపిస్తుంటారు. ఎప్పుడు చూసినా చెత్త ఏరుతూ, మొక్కలు నాటుతూ ఉంటారు. ఆయనే మనీశ్​ తివారీ. అందరూ 'పేడ్​' బాబా, 'ట్రీ' బాబా అని పిలుస్తుంటారు. లఖ్​నవూను హరితవర్ణంగా మార్చాలన్నది ఆయన కల. ఇందుకోసం తన జీవితాన్నే అంకితమిచ్చారు.

"చాలా మంది చెట్లు నరికేస్తున్నారు. రోగాల పాలవుతున్నారు. రోగాలు ఎలా వస్తాయో వారికి తెలియదు. చెట్లు నరికేయడం వల్ల కాలుష్యం బారిన పడి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. వృక్షాలు.. జీవనానికి ఆధారం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు."
- మనీశ్​​ తివారీ (పేడ్​ బాబా)

ప్రస్తుతం గులాలా ఘాట్​ శ్మశానవాటికను బృందావనంగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు ట్రీ బాబా. అక్కడున్న చెత్త ఏరుతూ.. మొక్కలు నాటి, నీళ్లు పోస్తూ ఉంటారు. ఎవరి సాయం కోరకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయానికి ప్రభుత్వంపై ఆధార పడకూడదని.. తొలి అడుగు మనమే వేయాలని చెబుతుంటారు ఈ 'ట్రీ' బాబా.

ఇదీ చూడండి:బోఫోర్స్ దర్యాప్తు కొనసాగుతుంది: సీబీఐ

ABOUT THE AUTHOR

...view details