తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొక్కలు కాదు... భారీ చెట్లు నాటారు - వుడ్​ సైన్స్​ ఇనిస్టిట్యూట్

బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. యంత్రాల సహాయంతో ఒకచోట ఉన్న చెట్లను వేరొక చోట నాటారు.

మొక్కలు కాదు... చెట్లు నాటేందుకు భారీ యంత్రాలు

By

Published : Jun 5, 2019, 9:32 PM IST

Updated : Jun 6, 2019, 12:02 AM IST

మొక్కలు కాదు... భారీ యంత్రాలతో చెట్లు నాటారు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వుడ్​ సైన్స్​ ఇనిస్టిట్యూట్ అండ్ టెక్నాలజీ సంస్థ, వోల్వో కంపెనీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. చెట్లను ఒక స్థలం నుంచి మరొక స్థలానికి యంత్రాల సహాయంతో తరలించి నాటారు.
చెట్టుకు నష్టం జరగకుండా శాస్త్ర సాంకేతికతతో కూడిన యంత్రాల సహాయంతో ఇప్పటికే 247 చెట్లను ఒకచోట తొలగించి వేరే చోట నాటి సఫలీకృతులయ్యారు.

నిర్వాహకులు గత రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఒక వోల్వో యంత్రంతో చెట్లు నాటుతుండగా మరో యంత్రం ఈ బృందంతో చేరనుంది. రెండు యంత్రాలు పనిచేస్తే ఒక్కరోజు 14 నుంచి 16 చెట్లను మరో చోట నాటే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ప్రయాణికుల బస్సును అటకాయించిన గజరాజు

Last Updated : Jun 6, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details