తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ట్రాన్స్​జెండర్లకు ఆస్తిలో సమాన వాటా - Revenue Code Act 2020

ట్రాన్స్​జెండర్లకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారసత్వ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ రెవెన్యూ కోడ్​ చట్టంలో పలు మార్పులు చేసింది.

Transgenders get right to property in Uttar Pradesh
ఆ రాష్ట్రంలో ట్రాన్స్​జెండర్లకూ ఆస్తిలో సమాన వాటా

By

Published : Aug 20, 2020, 9:35 PM IST

ట్రాన్స్​జెండర్లకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారసత్వ భూమిలో వారికీ సమాన హక్కు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్​ప్రదేశ్​ రెవెన్యూ కోడ్​- 2006లో సవరణలకు రాష్ట్ర కేబినెట్​ ఆమోదం పలికింది.​

తాజా సవరణల ప్రకారం.. ట్రాన్స్​జెండర్లనూ భూ యజమాని కుటుంబంలో సభ్యులుగా గుర్తించాలని తెలిపిన ప్రభుత్వం.. ఆస్తి పంపకాల విషయంలో వారికి కూడా సమాన హక్కు కల్పించాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు యూపీ కొత్త రెవెన్యూ కోడ్​ సవరణ చట్టం-2020లో సెక్షన్​-4(10), 108(2), 109, 110లలో కూడా పలు మార్పులు చేశారని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:36-40 నెలల్లో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి

ABOUT THE AUTHOR

...view details