బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన క్రమంలో తమ సత్తా నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అయితే.. ఈసారి బిహార్ ఎన్నికల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. దేశంలోనే తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్.. ఎన్నికల పర్యవేక్షణ అధికారి (ప్రిసైడింగ్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తించనున్నారు.
పట్నాకు చెందిన ట్రాన్స్‌జెండర్ మోనికా దాస్‌ను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా నియమించింది ఎన్నికల సంఘం. ఆమె దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ బ్యాంకు అధికారి కూడా. ప్రస్తుతం కెనరా బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు.
బిహార్ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నుంచి ఇతర అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు మోనికా. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి శిక్షణను అక్టోబర్ 8న ఇవ్వనున్నారు.
గతంలో..