ఒడిశాలోని రాయగఢ్- కోరాపుట్ రైల్వే మార్గంలో సమలేశ్వరి ఎక్స్ప్రెస్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు.
హావ్డా నుంచి జగదల్పూర్ వెళ్తుండగా.. పట్టాలపై నిలిపి ఉంచిన ఓహెచ్ఈ కారును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజన్ సహా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలోనే ఇంజన్లో మంటలూ చెలరేగాయని అధికారులు తెలిపారు.