తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఖట్టర్​ జీ.. నాతో కాదు రైతులతో మాట్లాడండి' - trade unions protests updates

trade unions nationwide strike against Centre's new labour and farm laws
'సందేహాలు వద్దు.. కొత్త సాగు చట్టాలు అత్యవసరం'

By

Published : Nov 26, 2020, 9:05 AM IST

Updated : Nov 26, 2020, 4:42 PM IST

16:38 November 26

ఖట్టర్​కు దీటు జవాబు..

హరియాణా సీఎం ఖట్టర్​ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. మీ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయానని తెలిపారు. కనీస మద్దతు ధరపై రైతులకు నమ్మకం కలిగించాలని, తనకు కాదని పేర్కొన్నారు.

''ఖట్టర్​ జీ.. మీ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయా. కనీస మద్దతు ధరపై నమ్మకం కలిగించాల్సింది నాకు కాదు.. రైతులకు. దిల్లీకి వెళ్లేముందు మీరే ఒకసారి రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. నేనే ఒకవేళ రైతులను ప్రేరేపించి తప్పుదోవ పట్టిస్తే మరి హరియాణా రైతులు కూడా దిల్లీకి ఎందుకు ప్రదర్శన చేపట్టారు.''

         - అమరీందర్​ సింగ్​, పంజాబ్​ ముఖ్యమంత్రి

15:33 November 26

'అమరీందర్​.. మీరెక్కడ?'

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​పై విరుచుకుపడ్డారు హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​. వ్యవసాయ చట్టాలపై రైతులను అమరీందర్​ తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తాను పంజాబ్​ ముఖ్యమంత్రిని సంప్రదించేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన స్పందించడం లేదన్నారు. కనీసం కరోనా సంక్షోభం వంటి సమయాల్లోనైనా ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఆపాలని అమరీందర్​కు సూచించారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలు రైతులకు అవసరమని పునరుద్ఘాటించారు ఖట్టర్​. కనీస మద్దతు ధరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చిచెప్పారు. 

15:11 November 26

'ఈ చట్టాలు అత్యవసరం'

రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ స్పందించారు. కొత్త వ్యవసాయ చట్టాలు అత్యవసరమని పునరుద్ఘాటించారు. రానున్న రోజుల్లో ఈ చట్టాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్​ రైతుల్లో ఉన్న సందేహాలు, చట్టాలపై ఉన్న వ్యతిరేక భావాలను తొలగించేందుకు కార్యదర్శి స్థాయిలో చర్చించినట్టు వెల్లడించారు. వచ్చే నెల 3న అక్కడి వారితో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో ఆగ్రహం తెచ్చుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు తోమర్​. సమస్యలపై చర్చించి, విభేదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీని ద్వారా సత్ఫలితాలు అందుతాయన్నారు.

13:39 November 26

అంబాలా వద్ద మరింత ఉద్రిక్తం

అంబాలా వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు  జల ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు. ఆందోళనకారులు సడోపుర్ సరిహద్దు వద్ద పోలీసు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

11:05 November 26

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు హరియాణా అంబాల సమీపంలోని శాంభు సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దిల్లీ వెళ్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు బారీకేడ్లను తొలగించి వంతెనపై నుంచి కిందకు విసిరారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

10:50 November 26

హరియాణా అంబాల సమీపంలోని శాంభు సరిహద్దు వద్ద గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

10:27 November 26

'చలో దిల్లీ' ఆందోళనలు హరియాణాలో ఉద్రిక్తంగా మారాయి. అంబాల సమీపంలోని శాంభు సరిహద్దు వద్ద రైతులపై జల ఫిరంగులు ప్రయోగించారు పోలీసులు. దిల్లీ వెళ్తున్న వారిని అడ్డుకుని వెనక్కి పంపారు.

09:43 November 26

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బంగాల్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి సీపీఐ(ఎంఎల్​), సీపీఎం, కాంగ్రెస్. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాదవ్​పుర్​లోని రైల్వే ట్రాక్​ను నిర్బంధించారు ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు. 

09:34 November 26

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్​లో రైతు, కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.  రహదారులను దిగ్బంధించాయి. జెండాలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.

09:21 November 26

రైతు, కార్మిక సంఘాల నిరసనలను దృష్టిలో ఉంచుకుని దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాతం సింఘూలో పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్ల సాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

09:17 November 26

రైతుల ఆందోళనల నేపథ్యంలో హరియాణా కర్నల్​లోని కర్న సరస్సు వద్ద పోలీసులు మోహరించారు.

09:10 November 26

'చలో దిల్లీ' ర్యాలీ నేపథ్యంలో దిల్లీ-ఫరీదాబాద్​ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భారతీయ కిసాన్​ యూనియన్​కు చెందిన ఏ ఒక్కరినీ ఇవాళ, రేపు దిల్లీలోకి అనుమతించొద్దని తమకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిపారు.

08:59 November 26

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బంగాల్​లో ఆందోళనలు నిర్వహించాయి వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు. కోల్​కతాలో ర్యాలీలు నిర్వహించాయి. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బెల్గారియా రైల్వే ట్రాక్​పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి.

08:40 November 26

దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆందోళనలు

కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.  నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 'ఛలో పార్లమెంట్' మార్చ్​ను నిర్వహిస్తున్నాయి. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ, హెచ్​ఎంఎస్​, ఏఐయూటీయూసీ, ఎస్​ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్​పీఎఫ్​, యూటీయూసీలు ఇందులో పాల్గొంటున్నాయి.

ప్రధాన డిమాండ్లు?

  • పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 నగదు అందించాలి.
  • పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ నెలకు 10 కిలోల రేషన్​ బియ్యం ఉచితంగా ఇవ్వాలి.
  • ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరంలో 200 రోజులకు పొడిగించాలి.
  • కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి.
  • నూతన పెన్షన్​ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసి.. అందరికీ పెన్షన్​ వచ్చేలా చేయాలి.
Last Updated : Nov 26, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details