నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాలు డిసెంబర్ 8న(మంగళవారం) తలపెట్టిన ‘భారత్ బంద్’కు ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు పది ట్రేడ్ యూనియన్ల ఐక్యవేదిక.. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలు, ఇతర అంశాలపై గత నెల 26న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. తాజాగా రైతులు తలపెట్టిన బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి కార్మిక సంఘాలు.
ఆ పది యూనియన్లు ఇవే..
భారత్ బంద్‌కు మద్దతు తెలిపిన ట్రేడ్ యూనియన్లలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ సంఘాలు ఉన్నాయి.
వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది ట్రేడ్ యూనియన్ ఐక్యవేదిక. ఈ బంద్‌కు కార్మికులు, ఉద్యోగులు, అనుబంధ సంఘాల సభ్యులు సంఘీభావం తెలియజేయాలని కోరాయి. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలమైతే భారత్ బంద్‌ను ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.
ఇదీ చదవండి:సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే- రైతుల పట్టు