భూతల స్వర్గం కశ్మీర్‌కు తిరిగి పర్యటక శోభ సంతరించుకోనుంది. కశ్మీర్ పర్యటనపై రెండు నెలల ముందు జారీ చేసిన అత్యవసర ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నేటి నుంచి పర్యటకులను అనుమతించనుంది.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5నకేంద్రం రద్దు చేసింది. అంతకుముందు ఆగస్టు 2న జమ్ముకశ్మీర్‌లో పర్యటనలపై ఆంక్షలు విధించింది.