తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 49,931 కేసులు.. 708 మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటిపోయింది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 49,931 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 708 మంది మరణించారు.

Total #COVID19 positive cases stand at 14,35,453 including 4,85,114 active cases,
దేశంలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Jul 27, 2020, 9:35 AM IST

Updated : Jul 27, 2020, 10:11 AM IST

దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 14 లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 14,35,453కి చేరింది.

మరో 708 మంది కరోనా ధాటికి మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 32,771కి పెరిగింది.

  • యాక్టివ్ కేసులు 4,85,114
  • కోలుకున్నవారు 9,17,568 మంది

మరోవైపు పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 9,431 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 267 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,75,799కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 13,656మంది మృతి చెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 1,48,601గా ఉంది.

తమిళనాడులో..

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో మరో 6,986 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 85మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,13,723కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 3,494కి చేరింది.

కర్ణాటక

వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న కర్ణాటకలో కొత్తగా 5,199మంది వైరస్ బారినపడ్డారు. మరో 82 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 96,141కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,878మంది మృత్యువాతపడ్డారు.

కేరళ

కేరళలోనూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 927మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 18,957కి చేరింది. వైరస్​ కారణంగా 59మంది ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Jul 27, 2020, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details