తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎదురుకాల్పుల్లో యూపీఆర్‌ఎఫ్‌ ఉగ్ర నేత హతం - ఎన్​కౌంటర్​

అసోంలోని సింఘాసన్‌ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో యునైటెడ్​ పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్​ ఛైర్మన్​ మార్టిన్​ గైట్​ హతమయ్యాడు. కార్పి అంగ్లాగ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ​

UPRF militant
ఎదురుకాల్పుల్లో యూపీఆర్‌ఎఫ్‌ ఉగ్ర నేత హతం

By

Published : Oct 7, 2020, 6:54 AM IST

అసోంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో యునైటెడ్‌ పీపుల్స్‌ రెవల్యూషనరీ ఫ్రంట్‌(యూపీఆర్‌ఎఫ్‌) ఛైర్మన్‌ మార్టిన్‌ గైట్‌ హతమయ్యాడు. కార్బి అంగ్లాంగ్‌ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో సింఘాసన్‌ అడవుల్లో సోమవారం రాత్రి భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో జవాన్లకు తారసపడిన యూపీఆర్‌ఎఫ్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారని పేర్కొన్నారు. అప్రమత్తమైన జవాన్లు కాల్పులు జరపడంతో ఓ ముష్కరుడు మృతి చెందినట్లు తెలిపారు. మంగవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించగా ముష్కరుడి మృతదేహం లభ్యమైందని.. మృతుడిని యూపీఆర్‌ఎఫ్‌ సంస్థ ఛైర్మన్‌ మార్టిన్‌ గైట్‌గా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఇలాంటి కిరాతకులకు ఉరే సరి: దిల్లీ కోర్టు

ABOUT THE AUTHOR

...view details