యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా-ఐ)లో ద్వితీయ అగ్రనేత.. ద్రిష్టి రాజ్‌ఖోవా మేఘాలయలో బుధవారం లొంగిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సైనిక నిఘా అధికారుల కస్టడీలో ఉన్న ఆయనను అసోంకు తీసుకురానున్నారు. ఉల్ఫా అగ్రనేత పరేష్ బారువాకు రాజ్‌ఖోవా అత్యంత సన్నిహితుడు. ఇటీవల వరకూ బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు సమాచారం. రాజ్‌ఖోవా లొంగుబాటు తీవ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.
ఉల్ఫా(ఐ) అగ్రనేత రాజ్‌ఖోవా లొంగుబాటు - ulfa
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా-ఐ)కు చెందిన కీలక నేత రాజ్‌ఖోవా మేఘాలయలో లొంగిపోయారు. ఈ మేరకు ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఉల్ఫా(ఐ) అగ్రనేత రాజ్‌ఖోవా లొంగుబాటు