జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో కరుడుకట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఆసిఫ్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రసంస్థ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆసిఫ్.. గత కొంతకాలంగా జమ్ము వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.
పక్కా సమాచారంతో ఆసిఫ్‌ను బుధవారం ఉదయం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదిని లొంగిపోమని ఆదేశించాయి. కానీ ఎదురుదాడికి దిగిన ఉగ్రవాది.. గ్రనేడ్లతో భద్రతా బలగాలపై దాడి చేశాడు. ఆసిఫ్ చర్యను సమర్థంగా తిప్పికొట్టి.. అతడిని హతమార్చాయి బలగాలు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.